వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు సందీప్ కిషన్. ఆ తర్వాత మంచి విజయాలు అందుకోలేదు సందీప్ కిషన్. అయితే.. తాజాగా.. సందీప్ కిషన్ హీరోగా ఎంవీవీ బ్యానర్‌లో కొత్త సినిమా రాబోతుంది. ఈ సినిమా కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ప్రొడక్షన్‌లో వస్తుంది. ఈ సినిమాకు కోన వెంకట్ కథను అందిస్తున్నాడు. నాగేశ్వర్‌రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే.. ఈ సినిమా ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. “రౌడీ బేబీ” అనే టైటిల్‌ను ఖరారు చేసింది ఈ చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన నేహ శెట్టి హీరోయిన్‌గా నటించబోతుంది. నేహ శెట్టి ఇప్పటికే మహబూబా సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది నేహశెట్టి. తాజాగా సందీప్ కిషన్‌తో రొమాన్స్ చేయనుంది ఈ భామ. ఇక రౌడీ బేబీ సినిమా పూర్తిగా లవ్ యాంగిల్ వస్తుందని టాక్. ఇక ఈ మూవీ షూటింగ్ ఈ నెల 16 నుంచి వైజాగ్ లో ప్రారంభం కానుంది. సింగిల్ షెడ్యూల్‌లో ఈ సినిమా షూటింగ్ పూర్తిచేయనుంది ఈ చిత్ర యూనిట్.
previous post