telugu navyamedia
సినిమా వార్తలు

విడిపోతున్నామంటూ నాగచైతన్య ట్వీట్

యువ హీరో నాగచైతన్య, సమంతల వైవాహిక బంధానికి తెరపడింది. సమంతతో విడాకులు తీసుకోనున్నట్లు నాగచైతన్య ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విడాకులు విషయంలో కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి నాగచైతన్య తెర దించేశాడు.

నాగచైతన్య తన విడాకుల వార్త నిజమేనంటూ శనివారం ట్వీట్ చేశాడు. భార్యాభర్తలుగా తమ బంధాన్ని ఇక మీదట కొనసాగించడం లేదని పేర్కొన్నాడు. దశాబ్దానికి పైగా తమ మధ్య ఏర్పడిన స్నేహబంధం గొప్పదని అన్నాడు. చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాం అన్నారు.

“ఇక నుంచి వేర్వేరుగా మా సొంత మార్గాల్లో ప్రయాణించాలనుకుంటున్నాం. పదేళ్లుగా మా స్నేహం కొనసాగినందుకు మేం అదృష్టవంతులం. మా స్నేహం వివాహ బంధానికి చాలా కీలకంగా నిలిచింది. ఇప్పుడు ఈ కష్ట సమయంలో అభిమానుల మద్దతు కావాలి. మా గోప్యతను కాపాడాలని శ్రేయోభిలాషులు, మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం’’ అంటూ సోషల్ మీడియా వేదికగా నాగచైతన్య, సమంత వెల్లడించారు.

మొత్తం మీద నాగచైతన్య తొలిసారి తమ విడాకుల గురించి మీడియా ముందుకు రావడంతో ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టు అయ్యింది. విశేషం ఏమంటే నాగచైతన్య పెట్టిన ప్రెస్ నోట్ నే సమంత పేరు మార్చి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. వీరిద్దరి మధ్య ఇప్పటి వరకూ అండర్ స్టాండింగ్ అయితే బాగానే ఉంది.

మరి రాబోయే రోజుల్లో ఈ స్నేహబంధాన్ని ఇలానే కొనసాగిస్తారో లేదో చూడాలి. కొన్ని నెలలుగా నాగ చైతన్య, సమంత విడాకులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో పాటు ప్రధాన వార్తా పత్రికల్లోనూ విశేషంగా హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంలో నాగచైతన్య వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చాడు. సమంత మాత్రం సందర్భానుసారంగా ఏదో ఒక రీతిలో హింట్ ఇస్తూనే ఉంది.

ఆమె నెట్ ఫ్లిక్స్ లో నటించబోతున్న ‘డైవోర్స్’ అనే వెబ్ సీరిస్ ప్రమోషన్ కోసమే సమంత ఇలాంటి ప్రచారం చేస్తోందనే వార్తలూ
వచ్చాయి. సమంత సన్నిహితుల నుండి వచ్చిన సమాచారం ప్రకారం వారు ఇప్పటికే వారిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి విడాకులకు దరఖాస్తు చేసుకున్నారట.

కోర్టునుండి ఆదేశాలు రావడమే తరువాయి అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సమంతకు భరణంగా నాగార్జున ఫ్యామిలీ రూ.200 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడిందని, అయితే ఆ ఆఫర్‌ను సమంత సున్నితంగా తిరస్కరించిందనే పుకార్లూ వినిపించాయి. అయితే ఇవాళ నాగచైతన్య పోస్ట్ చేసిన ట్వీట్ ఈ పుకార్లన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేసింది.

Related posts