కండలవీరుడు, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను పాము కాటేసింది. పాము కాటు వేయడంతో వెంటనే సల్మాన్ ను ముంబయిలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. 6 గంటలపాటు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకున్నారు.
అయితే ఆ పాము విషం లేని పాము కావడంతో..కాటు వేసినా ప్రమాదం ఏమీ జరగలేదు. కాని కాటు వేసిన వెంటనే క్లారిటీ లేకపోవడంతో.. ఏం జరుగుతుందా అన్న భయంతో.. వెంటనే సల్మాన్ ను హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. సల్మాన్ ఖాన్‌ను పరీక్షించిన డాక్టర్లు.. ఆయనకు ఇప్పుడు ఎలాంటి ప్రమాదం లేదని తేల్చి చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటన మహారాష్ట్రలోని పన్వేల్‌లో ఫామ్‌హౌస్‌లో ఉండగా ఆదివారం తెల్లవారు జామున జరిగింది. ఆదివారం రాత్రి తన బర్త్‌డే పార్టీని సందడిగా నిర్వహించారు. ఈ రోజు (డిసెంబర్27 ) సల్మాన్ 56వ పుట్టిన రోజు జరుపుకోన్నాడు. బర్త్‌డే ముందు రోజు సల్మాన్ పాము కాటుకు గురవ్వడం అభిమానులు ఆందోళనకు గురైయ్యారు.

తాజాగా పాము కాటుపై సల్మాన్ ఖాన్ స్పందించారు..’ఒక పాము నా ఫామ్‌హౌస్‌లోకి వచ్చింది. ఒక కట్టెతో దాన్ని అవతలకు పారేయాలనుకున్నా. కానీ అది వెంటనే నా చేతిపైకి పాకింది. దాన్ని కిందపడేసేలోపే మూడుసార్లు నన్ను కాటేసింది. అది ఒకరకమైన విషపూరిత పాము అనిపించింది. ఆసుపత్రిలో ఆరు గంటలు ఉన్న తర్వాత నన్ను డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం బాగానే ఉన్నాను’ అని చెప్పుకొచ్చాడు.
“మేము ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత పామును వదిలేశాం. నా సోదరి చాలా భయపడింది. కాబట్టి ఆమె కోసం పాముతో ఓ ఫొటో దిగాను. ‘దానితో దోస్తీ కుదిరింది’ అని తనకు చెప్పాను.” అంటూ నవ్వుతూ చెప్పారు సల్మాన్.
![]()
సల్మాన్ తండ్రి మాట్లాడుతూ.. ‘నా కొడుక్కి పాము కాటేసిందనగానే ఎంతగానో భయపడిపోయాం. అది మరీ విషసర్పం కాకపోవడంతో త్వరగానే కోలుకున్నాడు. ఆస్పత్రికి వెళ్లి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకున్నాడు. అతడు ఆరోగ్యంగానే ఉన్నాడు. భయపడాల్సిన పనేమీ లేదు’ అని పేర్కొన్నాడు.

