ముంబై లో నిర్భయ తరహా లైంగిక దాడికి గురైన ఓ మహిళా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి మృతి చెందింది. సమాజం తలదించుకునేలా మానవ మృగాల దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచింది.
ముంబై మహానగరంలో ఢిల్లీలో జరిగిన ‘నిర్భయ’ ఘటనకు ఏ మాత్రం తీసిపోని విధంగా 32 ఏళ్ల మహిళపై కిరాతకులు అత్యంత పాశవికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలి ప్రయివేట్ భాగాల్లో రాడ్డును చొప్పించారు. అనంతరం నిందితుడు ఆమెను ఓ టెంపోలో పడేసి పరారయ్యారు. రక్తం మడుగులో కొట్టుమిట్టాడుతున్న మహిళను అపస్మారక స్థితిలో పడి ఉన్న మహిళను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో ఆ మహిళను ఘట్కోపర్లోని రాజా వాడి ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అయితే ఈ రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు తుదిశ్వాస విడిచింది.ఈకేసును సీరియస్గా తీసుకున్న ముంబై పోలీసులు.. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రధాన నిందితుడైన 45 ఏళ్ల వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

