telugu navyamedia
క్రైమ్ వార్తలు

హైదరాబాద్ రాయదుర్గంలోని గ్రీన్‌బవార్చి హోటల్లో అగ్నిప్రమాదం..

*హైదరాబాద్ రాయదుర్గంలోని గ్రీన్‌బవార్చి హోటల్లో అగ్నిప్రమాదం
*మంట‌లార్పుతున్న 4 ఫైరింజిన్లు..
*రెండో అంత‌స్తు నుంచి మూడో అంత‌స్తు వ‌ర‌కు వ్యాపించిన మంట‌లు..
*భ‌వ‌నం టెర్ర‌స్‌పైకి పరుగులు తీసిన ప‌లువురు..
*కొన‌సాగుతున్న రెస్క్యూఆప‌రేష‌న్‌..
*హోట‌ల్లో 20 మంది చిక్కుకున్నట్లు స‌మాచారం.

హైదరాబాద్ లో భారీ అగ్ని ప‍్రమాద ఘటన చోటుచేసుకుంది. రాయదుర్గంలోని గ్రీన్‌బవార్చి హోటల్‌లో  ఐమాక్‌ ఛాంబర్‌లోని 2వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. రెండో అంతస్తు నుంచి మంటలు మూడో అంతస్తుకు వ్యాపించాయి.ఎగిసిపడుతున్న మంటల కారణంగా బిల్డింగ్ పరిసరాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి.

Massive fire breaks out from Green Bawarchi hotel, 10 people saved

కాగా,  ప్రమాదం జరిగిన సమయంలో భవనం లోపల 20 మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. 10 మందిని సురక్షితంగా ఆస్పత్రికి తరలించారు. హోటల్‎లో మరో 10 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీయడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. బాదితులు తమను రక్షించాలంటూ భవనం టెర్ర‌స్‌పైకి పరుగులు తీస్తున్నారు.

ప‍్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి 4 ఫైరింజిన్లుతో మంటలు అదుపు చేస్తున్నారు.. ఆ ఆఫీసులో ఉన్న వారిని భారీ క్రేన్‌లో సాయంతో కిందకు దించారు.

Related posts