రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మెగా హీరో సాయిధరమ్‌తేజ్ చికిత్సకు స్పందిస్తున్నారు. శుక్రవారం రాత్రి తీగల వంతెన వైపు నుంచి ఐకియా వైపు వెళ్తుండగా ఆయన తన స్పోర్ట్స్ బైక్ నుంచి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ కుడి కంటి పైభాగంతో పాటు ఛాతీ భాగంలో గాయాలయ్యాయి.
అయితే మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతున్న సమయంలో సాయి ధరమ్ తేజ్ స్పృహలోకి వచ్చినట్లుగా అక్కడి వైద్యులు తెలిపారు. ఐసీయూలో చికిత్స అందుస్తునన్న సమయంలో సాయి ధరమ్ తేజ్.. చికిత్స్ స్పందించాడని వైద్యులు తెలిపారు.తాజాగా అందుకు సంబంధించిన విజువల్స్ వీడియోను మెడికవర్ ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు.
ఆ వీడియోలో డాక్టర్ సాయి ధరమ్ తేజ్‌ను కదిలించగా.. ఆ సమయంలో సాయి ధరమ్ తన చేతును కదిలిస్తున్నారు. ప్రస్తుతం తేజ్‌కు అపోలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు వైద్యులు.
అయితే ప్రమాదం జరిగిన తరువాత సాయి తేజ్‌ను ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు స్పృహలో లేరని తెలిపారు. ప్రమాదం తర్వాత ఫిట్స్ వచ్చాయని, అందుకే చేతిని గట్టిగా పట్టుకుని ఉన్నారని పేర్కొన్నారు. ఎక్కువగా రక్తస్రావం కాకపోవడం వల్ల ఎదుటి వ్యక్తిని గుర్తుపట్టే స్థితిలోనే ఉన్నారన్నారు. ఆయనకు కంటి మీద గాయం కాలేదని, అది చిన్న స్క్రాచ్ మాత్రమేనని చెప్పారు. చేతితో పాటు, ఛాతీ, కాళ్ల మీద చిన్నచిన్న గాయాలయ్యాయని పేర్కొన్నారు. అలాగే కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయ్యిందని, అయితే ఇది పెద్ద సమస్యేమీ కాదని, తొందరగానే నయమవుతందని చెప్పుకొచ్చారు.