telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కాశీనాయన జ్యోతి క్షేత్రానికి RTC సర్వీసులు పునరుద్ధరణ – లోకేష్ సత్వర స్పందన

కడప జిల్లా కాశీనాయన జ్యోతి క్షేత్రానికి ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపివేయడంపై స్పందించిన
విద్యా, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ తక్షణమే సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.

అటవీ, ఆర్టీసీ శాఖలతో
సమన్వయం జరిపిన అనంతరం, ప్రజల సౌకర్యార్థం ఈ మధ్యాహ్నం నుంచే ఆర్టీసీ బస్సు సర్వీసులను తిరిగి ప్రారంభించాలన్న ఆదేశాలు జారీ చేశారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ గతంలో అక్కడి అన్నదాన సత్రాలను వ్యక్తిగత వ్యయంతో పునర్నిర్మించి సేవలను పునఃప్రారంభించారు.

భక్తుల మనోభావాలు, ప్రయాణ సౌకర్యాల విషయంలో ప్రజా ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తుందని మంత్రి అన్నారు.

Related posts