*చిత్తూరు జిల్లా చంద్రగిరి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం..
*కారులోని నలుగురు అక్కడికక్కడే మృతి..
* రెండేళ్ల పాపతో పాటు ముగ్గురు మృతి..
ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చంద్రగిరి మండలం ఐతేపల్లి నాయుడుపేట జాతీయ రహాదారి వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో రెండేళ్ల చిన్నారి, ఇద్దరు మహిళ, ఒక వ్యక్తి ఉన్నారు. ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. బాదితులు కాణిపాకం వినాయాక స్వామి దర్శించుకుని తిరిగి వస్తుండంగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులంతా విశాఖకు చెందినవారుగా గుర్తించారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అతివేగంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలుపుతున్నారు.