telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికన ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కి బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.

రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ తో కలిసి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్రపతి కి స్వాగతం పలికారు.

బొల్లారం రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న భారతీయ కళా మహోత్సవం (రెండవ ఎడిషన్) ప్రారంభించడానికి రాష్ట్రపతి నగరానికి వచ్చారు.

రాష్ట్రపతి గారికి స్వాగతం పలికిన వారిలో కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ఉన్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు, డీజీపీ బి. శివధర్ రెడ్డి తో పాటు త్రివిధ దళాలకు చెందిన ప్రతినిధులు, నగర ప్రముఖులు ఉన్నారు.

Related posts