ప్రపంచ బాక్సింగ్ కప్ తుది పోరులో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాభినందనలు తెలియజేశారు.
గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో (51 కేజీల విభాగంలో) అద్భుత ప్రతిభను ప్రదర్శించి మరోసారి ప్రపంచ వేదికపై దేశ కీర్తిని నలుదిశలా చాటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు.
ఈ విజయం యువ క్రీడాకారులకు స్పూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో నిఖత్ జరీన్ మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ముఖ్యమంత్రి గారు అభిలషించారు.

