telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అందాల ఆరబోతలో ముందున్న హీరోయిన్

malavika

‘నేల టిక్కెట్’ మూవీలో మాస్ మహరాజా రవితేజతో మాళవిక శర్మనటించింది. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయిన ఈ అమ్మాయి నటనకు మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు ఇస్మార్ట్ హీరో రామ్ సరసన ‘రెడ్‌’ సినిమాలో నటిస్తోంది. ‘రెడ్’ సినిమా తనకు తప్పకుండా మంచి గుర్తింపును తెచ్చిపెడుతోందని మాళవిక హోప్స్ పెట్టుకుంది. ఈమెకు సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 6.4 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. తన అభిమానులను సంతోషపెట్టడానికి ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. కాగా, ‘రెడ్’ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ‘నువ్వే నువ్వే’ సాంగ్‌లో మాళవిక చాలా అందంగా కనిపించి అందరి దృష్టిలో పడింది. ఈ ఫాలోయింగ్‌ను మరింత పెంచుకోవాలని ఇన్‌స్టాగ్రామ్‌లో అందాలు ఆరబోస్తోంది. ఈ అమ్మడు పెట్టిన ఫొటోలకు లైక్స్, కామెంట్స్ లిస్ట్ పెద్దదే. తన టాలెంట్, బ్యూటీ‌తో మరింత గుర్తింపు తెచ్చుకోవాలని మాళవిక భావిస్తోంది. ఏప్రిల్ 9న ‘రెడ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా తర్వాత మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.

Related posts