telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కేజీఎఫ్-2 విడుదల తేదీ ఖరారు

kgf

కన్నడ చిత్రం కేజీఎఫ్ కన్నడ సహా విడుదలైన అన్ని భాషల్లో భారీ ఓపెనింగ్స్ రాబట్టి ఆ సినిమా హీరో యశ్ కు విపరీతమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. హిందీలోనూ కేజీఎఫ్ కు ప్రేక్షకాదరణ లభించింది. ఈ నేపథ్యంలో, కేజీఎఫ్ కు సీక్వెల్ గా కేజీఎఫ్ చాప్టర్-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. యశ్, శ్రీనిధి శెట్టి జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో సంజయ్ దత్, రవీనా టాండన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా కేజీఎఫ్-2 రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 23న రిలీజవుతుందని సోషల్ మీడియాలో వెల్లడించారు.

Related posts