మహానాడులో మంత్రి నారా లోకేష్ ప్రసంగం : పార్టీ లేకుండా చేస్తామన్న వారు.. అడ్రస్ లేకుండా పోయారు – తప్పు చేయకున్నా చంద్రబాబును జైలులో పెట్టారు – చంద్రబాబును జైల్లో పెట్టిన నేతను.. ప్రజలు ప్యాలెస్‌కు అంకితం చేశారు – సీబీఎన్ అంటే ప్రజలందరికీ ధైర్యం – అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మన అజెండా గత ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ప్రదేశ్‌గా మార్చింది – కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా.. పక్క రాష్ట్రానికి పంపారు – ప్రమాదకర మద్యంతో 30 వేల మందిని పొట్టనపెట్టుకున్నారు – గత ప్రభుత్వం మద్యం ద్వారా రూ.వేల కోట్లు లూటీ చేసింది – రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే కూటమి ఏర్పడింది – అందరూ జెండాలు.. అజెండాలు పక్కనపెట్టి పనిచేశారు – ప్రజలు కూటమిని ఆశీర్వదిస్తే ప్రజా ప్రభుత్వం ఏర్పడింది
ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రతి హామీ నిలబెట్టుకుంటున్నాం – జూన్‌లోనే తల్లికి వందనం కార్యక్రమం అమలు చేస్తున్నాం – అన్నదాత సుఖీభవ కార్యక్రమం త్వరలో అమలు చేస్తున్నాం – ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం – 16 వేలకు పైగా పోస్టులతో జూన్‌లో మెగా డీఎస్సీ నిర్వహిస్తున్నాం – వైసీపీ హయాంలో విధ్వంస పాలన – తల్లి, చెల్లిని గెంటేసిందెవరు? – వైఎస్ వివేకాను హత్య చేసిందెవరు? – ప్రజలను జగన్ ఏనాడైనా కలిశారా? – సామాన్యులకు ఇప్పటికీ తాడేపల్లి తలుపులు తెరుచుకోవు – 151 సీట్ల నుంచి 11కి ఎందుకు పడిపోయారో ఆలోచించుకోవాలి – అధికారంలో ఉన్నామన్న అహంకారం ఎప్పుడూ ఉండకూడదు – ఎంత ఎత్తుకు ఎదిగినా నేలపైనే నిలబడాలి – రెడ్‌బుక్ రెడ్‌బుక్ అంటూ ఎందుకయ్యా ఏడుస్తున్నారు – రెడ్‌బుక్ చూస్తే వణికిపోతున్నారు – చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారో.. వారికోసమే రెడ్‌బుక్ అని చెప్పా – రెడ్‌బుక్‌ను చూసి ఒకరికి గుండెపోటు వచ్చింది – మరొకరు బాత్‌రూమ్‌లో పడి చేయి విరగ్గొట్టుకున్నారు – ఇంకో వ్యక్తి ఏమయ్యారో మీకందరికీ తెలుసు : మంత్రి నారా లోకేష్
చంద్రబాబుకు పట్టం కట్టేందుకే మహిళలు: బొండా ఉమ