telugu navyamedia
సామాజిక

రీసైక్లింగ్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన రీ సస్టైనబిలిటీ మరియు దాదూస్ స్వీట్స్

స్థిరమైన పద్ధతులను సూచించడం మరియు ఏడాది పొడవునా బాధ్యతాయుతమైన రీసైక్లింగ్‌ను ప్రోత్సహించడం అనే ప్రాథమిక లక్ష్యంతో. వ్యర్థాల ప్రభావవంతమైన మరియు స్థిరమైన నిర్వహణ కోసం నూతన ప్రమాణాలను ఏర్పాటు చేయటానికి చేతులు కలిపిన ReSL మరియు Dadu’s Sweets

  • రీసైక్లింగ్ కేంద్రాలకు పంపబడే స్వీట్ బాక్స్‌ల సేకరణను సులభతరం చేస్తూ,ప్రతి దాదూ స్టోర్ వెలుపల రీ సస్టైనబిలిటీ ద్వారా   కియోస్క్‌లు వ్యూహాత్మకంగా అమర్చబడ్డాయి. బాధ్యతాయుతమైన పర్యావరణ చర్యలను ప్రోత్సహించడానికి, ఈ #GreenTransformationలో పాల్గొన్న కస్టమర్‌లకు 10% తగ్గింపు అందించబడుతుంది.
  • ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ మరియుSAP అధ్యయనం ప్రకారం, “అవగాహన మరియు కార్యాచరణ  మధ్య అంతరం ఉంది, కేవలం 48% భారతీయ వ్యాపారాలు తమ స్థిరత్వ లక్ష్యాలపై గణనీయమైన పురోగతిని సాధించాయని నివేదించాయి.”

పెరుగుతున్న ఉష్ణోగ్రత లు , పర్యావరణ ఆందోళనల నడుమ సంస్థలు మరియు వ్యక్తులు బాధ్యతాయుతమైన పరిరక్షణకు తమ అచంచలమైన అంకితభావాన్ని ప్రదర్శిస్తున్నారు.  వ్యర్థాలను బాధ్యతాయుతంగా రీసైకిల్ చేయడానికి వ్యాపారాలు వినూత్నమైన వ్యూహాలను ఎంచుకున్నప్పుడు #GreenTransformation సాధ్యమవుతుందని ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేళ ReSL మరియు Dadu’s Sweets ప్రదర్శించాయి.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం స్ఫూర్తితో మరియు ‘కుచ్ మిథా హో జాయే’ అనే భారతీయ భావజాలంతో హైదరాబాద్ మరియు పూణే అంతటా దాదూస్  అవుట్‌లెట్‌ల ముందు చిన్న కియోస్క్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. రీసైక్లింగ్ కేంద్రాలకు పంపబడే  స్వీట్ బాక్స్‌లను వినియోగదారుల నుండి  సేకరించేందుకు ఈ కియోస్క్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ బాక్స్ లు అందించిన  కస్టమర్‌లకు  దాదూస్  నుండి 10% తగ్గింపును స్వీట్స్  పై అందిస్తారు

“మా బాధ్యతాయుతమైన రీసైక్లింగ్ ప్రయత్నాల ద్వారా ఉత్పన్నమయ్యే సానుకూల ప్రభావాన్ని చూసేందుకు .ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము.  మేము ఏర్పాటు చేసిన  కియోస్క్‌ల వద్ద డిపాజిట్ చేసిన ప్రతి పెట్టెను  బాధ్యతాయుతంగా రీసైక్లింగ్ చేయనున్నాము. రాబోయే తరాలకు పచ్చని, మరింత స్థిరమైన భవిష్యత్తును ప్రోత్సహించే ప్రచారంలో భాగం కావడం నిజంగా సంతోషకరమైన విషయం” అని  రీ సస్టైనబిలిటీ –  సీఈఓ  శ్రీ మసూద్ మల్లిక్ అన్నారు.

“మేము వేడుకలను సృష్టించే వ్యాపారంలో ఉన్నాము మరియు మా పెట్టెలు సృష్టించే అసంఖ్యాక చిరునవ్వులను చూడటం ఆనందంగానే వున్నా ,  ప్రపంచంలోని వ్యర్థాలకు అవి విపరీతంగా జోడించబడుతున్నాయని  తెలుసుకోవడం కూడా కలత చెందుతుంది. ఈ కార్యక్రమం  పర్యావరణానికి తిరిగి ఇవ్వడానికి మరియు రేపటి కోసం మా వంతు కృషి చేయడానికి మా ప్రయత్నం.  నగరం లో మా స్టోర్స్ వద్ద  ఏర్పాటు చేయబడిన కియోస్క్‌లలో వాడిన స్వీట్ బాక్స్ లు అందించటం ద్వారా   10% తగ్గింపును పొందండి! ” అని   దాదూస్ స్వీట్స్  మేనేజింగ్ డైరెక్టర్,శ్రీ రాజేష్ దాదు అన్నారు.

Related posts