ఐపీఎల్ 2021 లో చెన్నై వేదికగా మొదటి మ్యాచ్ తో నేడు ముంబై ఇండియన్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నబెంగళూరు ముంబై ని బాగానే కట్టడి చేసింది.ముంబై ఇన్నింగ్స్ లో ఆ జట్టు ఓపెనర్ క్రిస్ లిన్(49) వద్ద వెనుదిరిగి ఒక్క పరుగు దూరంలో అర్ధశతకం చేజార్చుకున్నాడు. దాంతో ముంబై నిర్ణిత 20 ఓవర్లలో ముంబై 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.అయితే ఇక ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 5 వికెట్లు తీసి మొదటి 5 వికెట్ హాల్ సాధించాడు. అయితే ఈ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో మొదటి నాలుగు బంతులకు మూడు వికెట్లు తీసాడు హర్షల్ పటేల్. ఆ తర్వాత చివరి బంతికి రన్ ఔట్ రూపంలో 9 వ వికెట్ కోల్పోయింది ముంబై. ఇక కైల్ జామిసన్, సుందర్ చేరొక్క వికెట్ పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్ లో గెలవాలంటే కోహ్లీ సేన 160 పరుగులు చేయాలి. అయితే చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఏం జరుగుతుంది అనేది.
previous post
next post

