మహానాడులో సీఎం చంద్రబాబు ప్రసంగం : రాయలసీమ గర్జన.. రాష్ట్రమంతా మార్మోగాలి – జన సముద్రంతో కడప నిండిపోయింది – కడప తెలుగుదేశం పార్టీ అడ్డా – కడప టీడీపీ అడ్డా అని చెప్పేందుకే.. ఇక్కడ మహానాడు నిర్వహించాం – మంచి చేస్తే శాశ్వతంగా అండగా ఉంటామని నిరూపించారు – మంచి చేస్తే శాశ్వతంగా అండగా ఉంటామని నిరూపించారు – అన్ని దారులు కడపవైపే ఉన్నాయి.. కడప దిగ్బంధమైంది – కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి మహానాడు సూపర్ హిట్ – కడప రాజకీయం మారుతోంది – కడప గడపలో మార్పు కనిపిస్తోంది అహంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు – 2029 ఎన్నికల్లో ఉమ్మడి కడపలో పదికి పది స్థానాలు గెలవాలి – వైసీపీకి సీమలో 7 సీట్లు వస్తే.. కడప జిల్లాలోనే కూటమి 7 గెలిచింది – ఓడిన పార్టీ అర్థం చేసుకోలేదు.. చేసుకోదు కూడా – టీడీపీ.. అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు – ప్రజల జీవితాలు మార్చేందుకే పుట్టిన పార్టీ టీడీపీ – పాలన ఎలా ఉండకూడదో చెప్పే కేస్ స్టడీ.. వైసీపీ పాలన – గత పాలనలో హింసా
రాజకీయాలు, కేసులు, అణచివేతలు – కార్యకర్తల పోరాటం, త్యాగం, కష్టం ఫలితమే ప్రజా పాలన – కార్యకర్తలే నా బలం.. బలగం – విధ్వంస రాష్ట్రం పునర్నిర్మాణానికి పనిచేస్తున్నాం – వైనాట్.. గొడ్డలి పోట్లు అనేవి మన విధానం కాదు – ప్రతి క్షణం కష్టపడి పనిచేయడం మన విధానం – కష్టాలు చూసి బెదిరిపోలేదు.. సవాళ్లు చూసి పారిపోలేదు – క్లైమోర్ మైన్లకే భయపడలేదు.. సమస్యలకు భయపడతానా – ఇటుక, ఇటుక పేర్చుతూ విధ్వంస రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం – పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడం నా జీవిత ఆశయం – సంపద సృష్టించడం
తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ – నా కష్టం నాకోసం కాదు.. నన్ను నమ్మిన జనం కోసం – మనం కలిసికట్టుగా ఉంటే.. వైసీపీకి అడ్రస్సే ఉండదు – పేదల పొట్ట కొట్టిన వ్యక్తి మనకు అవసరమా? – 94 ప్రాయోజిత పథకాల్లో 73 పునరుద్ధరించాం – ఎస్సీలు, ఎస్టీలకు సూర్యఘర్ కింద ఉచితంగా రూఫ్ టాప్‌ల ఏర్పాటు – బీసీలకు 3 కిలోవాట్ల వరకు సూర్యఘర్ కింద రూ.98 వేల రాయితీ – కూటమి ప్రభుత్వం వచ్చాక ల్యాండ్ టైట్లింగ్ యాక్టు రద్దు చేశాం – గతంలో ప్రజల భూములు.. వైసీపీ నేతల ఖాతాల్లోకి వెళ్లేవి – గత పాలనలో భూముల విషయంలో గోల్‌మాల్
చేశారు – భూమి కబ్జా చేసేందుకు రికార్డులు అస్తవ్యస్తం చేశారు – వచ్చే మహానాడు నాటికి భూ సమస్యలు పరిష్కరిస్తాం – దేశానికి ఉగ్రవాదుల వల్ల చాలా నష్టం – రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదుల వల్ల అంతే నష్టం – రాజకీయాల ముసుగులో ల్యాండ్, శాండ్, మైన్స్ దోచారు – డ్రగ్స్, గంజాయి అమ్మితే అదే చివరి రోజని హెచ్చరిస్తున్నా – ఆడబిడ్డల జోలికి వస్తే అవే వారికి అంతిమ గడియలు – ఆర్థిక ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తాం – అన్ని సేవలు ప్రజలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి – వాట్సప్‌లో హాయ్ అని పెడితే పనులు జరుగుతాయి – 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం – గత పాలనలో భూతానికి పరిశ్రమలు వెనకడుగు వేశాయి – భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తున్నామని హామీ ఇచ్చా – రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్ తీర్చిదిద్దుతాం – రాయలసీమను రత్నాల సీమగా మార్చే బాధ్యత నాది – రాయలసీమను
రాష్ట్రానికి మణిహారంగా మారుస్తాం – రాయలసీమ అభివృద్ధికి బ్లూప్రింట్ ఉంది – రాయలసీమ అభివృద్ధికి పక్కా ప్రణాళిక ఉంది – ఆరు నెలల్లో కడప హజ్‌హౌస్ పూర్తిచేస్తాం – కర్నూలుకు హైకోర్టు బెంచ్ తప్పకుండా వస్తుంది – జూన్ 12లోగా కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంటు పనులు ప్రారంభం – ఫేజ్-1లో రూ.4500 కోట్లతో 3500 మందికి ఉద్యోగాలు – రూ.5 వేల కోట్లతో కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులు – అన్నమయ్య ప్రాజెక్టును మళ్లీ చేపట్టే బాధ్యత తీసుకుంటా – గతంలో రాయలసీమను రాజకీయం కోసం వాడుకున్నారు – ఏడాదిలో హంద్రీనీవా, సుజల స్రవంతికి రూ.3870 కోట్లు ఖర్చు చేస్తాం – గాలేరు, నగరిని కడప వరకు తీసుకువస్తాం – గాలేరు, నగరికి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేస్తాం – ఈ ఏడాదే గాలేరు, నగరి పనులు ప్రారంభిస్తాం – రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతాం – గండికోటలో కృష్ణదేవరాయలు వంద అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తాం – రాయలసీమను రాష్ట్రానికి మణిహారంగా మారుస్తా – పీ4 ద్వారా పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం : సీఎం చంద్రబాబు
previous post
పెండింగ్ బిల్లులతో చంద్రబాబు ప్రభుత్వాన్ని అప్పగించారు: మంత్రి కన్నబాబు