“ఛలో” సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేసులో దూసుకెళ్తోంది. విజయ్ దేవరకొండ సరసన “గీతగోవిందం” సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. వెండి తెరపై ఈ జంటకు తెలుగు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. దీంతో మళ్ళీ ఈ విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి “డియర్ కామ్రేడ్” చిత్రం చేశారు. ఈ సినిమా సంగతి ఎలా ఉన్నా… ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బిజీగా గడుపుతోంది. తెలుగులో మహేష్ తో ‘సరిలేరు నీకెవ్వరు’, నితిన్ తో ‘భీష్మ’ సినిమాలు చేస్తోన్న ఈ బ్యూటీ తమిళంలో కార్తీతో ఓ సినిమా చేస్తోంది. ఎంతో చలాకీగా ఉండే రష్మిక టాలీవుడ్ సూపర్ స్టార్స్ మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలలో ఆఫర్స్ కొట్టేసింది. ఇప్పుడు మరో స్టార్ హీరో సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. అల.. వైకుంఠపురములో సినిమాతో మంచి హిట్ కొట్టిన త్రివిక్రమ్ తన తర్వాతి సినిమాని ఎన్టీఆర్‌తో చేసేందుకు సన్నద్ధమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ , ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత మంచి విజయం సాధించడంతో ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో రూపొందనున్న చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆగస్ట్‌లో సెట్స్ పైకి వెళ్ళనున్న ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాకి ‘అయినను పోయిరావలె హస్తినకు..’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో రష్మికని కథానాయికగా తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట.
ఫెలైన విద్యార్థి ఏడ్చినట్టుంది చంద్రబాబు ఎడుస్తున్నాడు !