telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిన్నప్పుడే కవర్ పేజ్ పై రష్మిక… పిక్ వైరల్

Rashmika

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఎంపిక చేసారు. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది రష్మిక. తాజాగా రష్మిక చిన్నప్పటి ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న రష్మిక తన చిన్నప్పుడే ఓ మ్యాగ్‌జైన్ కవర్ పేజీపైకి ఎక్కడం ఇక్కడ విశేషం. ఈ ఫొటోని స్వయంగా రష్మికానే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు కవర్ పేజీపైన హీరోయిన్ కనిపించాలంటే చాలా తతంగం ఉంది. ఆ హీరోయిన్ ఎక్స్‌పోజింగ్‌లో దిట్ట అయినా అయ్యిండాలి లేదంటే టాప్ హీరోయిన్ అయినా అయ్యిండాలి. ఈ మ్యాగ్‌జైన్ కవర్ పేజీపై ఉన్న రష్మిక ఏజ్ ఎంతో తెలుసా? 5 సంవత్సరాలు. గోకులం అనే మ్యాగ్‌జైన్‌లో 2001లో వచ్చిన కవర్ పేజీ ఇది అని తెలుపుతూ.. ‘‘ఈ ఫొటోని మా అమ్మ దాచుకుంది, ఇదొక్కటే కాదు ఇప్పటికీ ఏ మ్యాగ్‌జైన్ కవర్ పేజీపై నా ఫొటో వచ్చినా దానిని అమ్మ ఇలాగే దాచుకుంటుంది..’’ అని రష్మిక తెలిపింది.

Related posts