telugu navyamedia
సినిమా వార్తలు

ఏపీలో క్యాసినో రగడ..పూర్తి మ‌ద్ద‌తు తెలిపిన వ‌ర్మ‌

సంక్రాంతి పండ‌గ‌ సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో గోవాకు చెందిన క్యాసినో నిర్వాహకులు కొడాలి నానికి చెందిన కన్వెన్షన్‌ సెంటర్‌లో జూదం నిర్వహించారనే విషయం ఏపీలో సంచలనం కలిగించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ క్ర‌మంలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టిస్తున్నారని వైసీపీ ప్ర‌భుత్వంపై ప్రతిపక్ష పార్టీల నాయకుల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ క్యాసినో వ్యవహారంపై స్పందించిన వివాద‌స్ప‌ద రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్లు క్యాసినో వ్యవహారంపై మరింత హీట్‌ పెంచుతున్నాయి.

Viral Video: Goa Like Casino Setup In Gudivada

గత కొద్దిరోజులుగా ఏపీ మంత్రి కొడాలి నానికి ఆర్జీవీకి మధ్య గత కొద్దిరోజులుగా వార్ న‌డిచిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఆర్‌జీవీ తనదైన స్టైల్‌లో నెట్టింట్లో విమర్శలు గుప్పించారు.

గుడివాడ ఆధునికీకరణకు శ్రీకారం చుట్టిన కొడాలి నానికి తాను పూర్తిగా మద్దతు తెలుపుతున్నానని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. క్యాసినో కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళంతా పూర్వీకులని, వారికి ఏమీ తెలియదని రాంగోపాల్ వర్మ సెటైర్లు వేశారు. వారంతా చరిత్రపూర్వ చీకటి యుగాలకు ప్రగతిని లాగుతున్న వారని రాం గోపాల్ వర్మ పేర్కొన్నారు. 

“గుడివాడను లండన్, లాస్‌వెగాస్‌, పారిస్‌ లాంటి దేశాల లిస్టులో ఉంచేందుకు కొడాలి నాని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకు ఆయనను తప్పకుండా మెచ్చుకోవాలి” అంటూ మరో ట్వీట్ చేశారు.

“గోవాలో ఉన్న క్యాసినో సంస్కృతిని ఏపీలోని గుడివాడకు తీసుకొచ్చిన నానిని ఎందుకు విమర్శిస్తున్నారు. వారంతా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది.. గుడివాడ ప్రజలు గోవాకు వెళ్తారని గుర్తించాలి కానీ గోవా ప్రజలు గుడివాడకు రారు అని జై గుడివాడ’’ అంటూ తనదైన స్టైల్‌లో రాంగోపాల్ వర్మ ట్వీట్‌ చేశారు.

Related posts