సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్స్‌లో రూపొందుతున్న ఎమోషనల్ డ్రామా “డియర్ కామ్రేడ్”. “యు ఫైట్ ఫర్ వాట్ యు లవ్” ట్యాగ్ లైన్. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. సామాజిక బాధ్యత ఉన్న ఇన్‌టెన్సివ్ పాత్రలో విజయ్ దేవరకొండ మెప్పించనున్నారు. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. “డియర్ కామ్రేడ్” ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శృతి రామచంద్రన్, సుహాస్, చారు హాసన్, ఆనంద్ ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.
తాజాగా “డియర్ కామ్రేడ్” సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. విడుదలకు మూడు రోజుల ముందే బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని చూసేశారు. “డియర్ కామ్రేడ్‌ను చూసిన మొదటి ప్రేక్షకుడిని నేను కావడం సంతోషంగా ఉంది. సినిమా చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. ఉద్వేగంతో కూడిన ప్రేమకథ. విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటన మరో స్థాయిలో ఉంది. ప్రేక్షకులకు ముఖ్యమైన మంచి సందేశాన్ని ఇస్తుంది. దర్శకుడు భరత్ కమ్మ శక్తివంతంగా డైరెక్ట్ చేశారు. మైత్రీ మూవీస్ అద్భుతంగా నిర్మించింది. జస్టిన్ ప్రభాకరన్ చాలా మంచి సంగీతం అందించారు. డియర్ కామ్రేడ్‌ను ధర్మ మూవీస్ హిందీలో రీమేక్ చేస్తుందని ప్రకటించడం పట్ల ఎంతో సంతోషిస్తున్నాను” అని కరణ్ జోహార్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టుకు విజయ్ దేవరకొండ, నిర్మాత నవీన్ ఎర్నేని, డైరెక్టర్ భరత్ కమ్మలతో తీసుకున్న ఫొటోలను జత చేశారు.