telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రజనీకాంత్‌ కొత్త పార్టీకి కౌంట్‌ డౌన్‌… ఆస్పత్రి నుంచే అన్ని నడిపించనున్నాడా !

సూపర్ స్టార్ రజనీ కాంత్ ఇటీవల తన సొంత పార్టీని ప్రకటించి తమిళ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు. తన పార్టీకీ ఆటో గుర్తును ఎంచుకున్నారు. దాంతో పాటుగా పార్టీకి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ నెల 31న జరగనున్న సమావేశంలో తెలియజేస్తానని అన్నారు. ఇంతలో తన నూతన సినిమా అణ్ణాతే చిత్రీకరణలో రజనీ పాల్గొన్నారు. ఈ సినిమా షేడ్యూల్ ప్రకారం హైదరాబాద్‌కు ఇటీవల చేరుకున్నాడు. అయితే ఈ చిత్ర యూనిట్‌లో దాదాపు ఎనిమిది మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సినిమా షూటింగ్‌ను నిలిపివేశారు. దాంతో రజనీ విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం సూపర్ స్టార్ రజనీ అస్వస్థత కారణంగా హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరారు. రజనీ అనారోగ్యానికి కారణంగా అధిక రక్తపోటు అని తేలింది. ఈ క్రమంలో టాలీవుడ్ డైలాగ్ కింగ్ మోహన్ బాబు రజనీను కలిసి పరామర్శించారు. అయితే ఇటువంటి సమయంలో రజనీ 31న నిర్వహించనున్న సమావేశం సంగతేంటని సందేహాలు రేకెత్తుతున్నాయి. అసలు ఈ సమావేశం జరుగుతుందా.. లేదా.. అనేకాకుండా. ఒకవేళ జరిగితే ఎలా జరుగుతుంది. ఈ సమావేశానికి రజనీ హాజరవుతారా? అన్న సందేహాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రజనీ చిత్ర యూనిట్‌లో కరోనా వచ్చిన కారణంగా దాదాపు 15రోజుల పాటు హో క్వారంటైన్‌లో ఉండాలని దాంతో రజనీ సమావేశానికి హాజరుకారని కొందరు అనుకుంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే రజనీ ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించే అవకాశాలు లేక పోలేదు. మరి ఈ సమావేశం ఎలా జరుగుతుందనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Related posts