సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి అత్యంత అరుదైన గౌరవం దక్కింది. సినీ రంగానికి ఇచ్చే ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని రజనీకాంత్ సొంతం చేసుకున్నాడు. 2019 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు రజనీ ఎంపికయ్యారు.
కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ గురువారం ఆయనను “భారతీయ సినిమా చరిత్రలో గొప్ప నటులలో ఒకరు” అని వ్యాఖ్యానిస్తూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రధానమంత్రి మోడీ సైతం ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నారు
ఈ అవార్డుని ప్రకటించిన అనంతరం మీడియాలో స్పదించాడు రజినీకాంత్. ఇంత గొప్ప అవార్డుని తనకి ఇచ్చినందుకు రజనీకాంత్ రోసారి ఆనందం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలిపాడు . అసలు ఈ అవార్డు దక్కించుకుంటానని అనుకోలేదని అన్నారు.
తన గురువు , దర్శకుడు కె.బాల చందర్ ఈ సమయంలో మన మధ్య లేకపోవడం చాలా బాధగా ఉందని చెప్పారు. నేను అవార్డు తీసుకోవడం చూసేందుకు, ఆయన లేరనే విషయం నాకు చాలా బాధగా ఉంది” అని రజినీకాంత్ గుర్తు చేసుకున్నారు. అలాగే తన సినిమాలకు పని చేసిన దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులందరికీ, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇదిలా ఉండగా గతేడాది పాల్కే అవార్డును బాలివుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ దక్కించుకున్నారు. సినీ రంగంలో సేవలు అందించిన వారికి ఈ అవార్డును బహుకరిస్తారు. భారతీయ సినీ పరిశ్రమ కు దాదా సాహెబ్ చేసిన కృషి కి గాను 1969 నుండి ఈ అవార్డులను ప్రకటిస్తున్నారు. తెలుగు పరిశ్రమ నుండి ఇప్పటివరకు కె. విశ్వనాథ్, డి. రామానాయుడు, దాదా సాహెబ్ పాల్కే అవార్డును అందుకున్నారు.
.