రాహుల్ గాంధీతో తెలంగాణకు చెందిన 39 మంది కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం నాడు భేటీ అయ్యారు. రాహుల్ గాంధీతో కాంగ్రెస్ నేతలు సుమారు మూడు గంటలకు పైగా చర్చించారు. ఈ భేటీ ముగిసిన తర్వాత కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్, ఎంఐఎం తో తమకు ఎలాంటి పొత్తులుండవని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. తమ మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలను కూడా పరిష్కరించుకొన్నామన్నారు. రానున్న రోజుల్లో సంఘటితంగా ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు.
తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని రాహుల్ గాంధీ తమకు సూచించారని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రజలకు మంచి పరిపాలన అందించటమే కాంగ్రెస్ లక్ష్యమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈమేరకు ప్రజాసమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా పోరాడేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, అంతర్గత వ్యవహారాలపై చర్చించినట్లు తెలిపారు. భిన్నాభిప్రాయాలను పక్కనబెట్టి ఏకతాటిపైకి వచ్చి తెరాస, భాజపాలకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో పోరాటం చేసేందుకు నిర్ణయించినట్లు వెల్లండించారు.
కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్తేజం తీసుకొచ్చేందుకు తెలంగాణలో రాహుల్ గాంధీ వరుస పర్యటనలు చేస్తారని చెప్పారు. రాహుల్‌గాంధీ సమక్షంలోనే ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు టికెట్ల కేటాయింపు జరగనుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.


నలుగురు ఎంపీలు గెలవగానే ఊహల్లో విహరిస్తున్నారు: ఉత్తమ్