కశ్మీరీ అమ్మాయిల గురించి హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారాయి. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో, ఇక అందరి చూపు అందమైన కశ్మీరీ అమ్మాయిలపైనే ఉంటుందని, వారిని కోడళ్లుగా, భార్యలుగా తెచ్చుకునేందుకు మొగ్గు చూపుతారంటూ హర్యానా సీఎం చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు.
పురుషులు సొంతం చేసుకోవడానికి మహిళలేమీ ఆస్తులు కాదని స్పష్టం చేశారు. కశ్మీరీ యువతులపై హర్యానా సీఎం వ్యాఖ్యలను రాహుల్ ఖండించారు. . అభద్రతాభావంతో కూడిన ఓ బలహీన మనస్తత్వం ఉన్న వ్యక్తిని ఏళ్ల తరబడి ఆర్ఎస్ఎస్ శిక్షణ ఎలా తయారుచేస్తుందో చెప్పడానికి ఖట్టర్ వ్యాఖ్యలే ఉదాహరణ అని విమర్శించారు.