telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ప్రపంచ కప్ .. భారత టీంపై .. రాహుల్ ద్రావిడ్

rahul dravid on world cup india team

టీమిండియా మాజీ ఆటగాడు రాహుల్‌ ద్రవిడ్‌ ప్రపంచకప్‌కు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు అన్ని విధాలా బాగుందని అంటున్నారు. త్వరలో ప్రపంచకప్‌లో ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… ప్రపంచ కప్‌కు ఎంపికైన జట్టు చాగా బాగుంది.. అన్ని విధాలా సరితూగే విధంగా ఉంది. అన్ని కాంబినేషన్‌ల ఆటగాళ్లు ఉన్నారు. అయితే, వారు ఈ టోర్నమెంట్‌లో ఎలా ఆడతారన్నదే ప్రశ్న. టీమిండియా ఎంపికపై ఎల్లప్పుడూ ఒకటి, రెండు రకాలుగా వాదనలు ఉంటాయి.. ఒకరిద్దరి ఆటగాళ్ల విషయంలో వాదనలు జరుగుతుంటాయి’ అని వ్యాఖ్యానించారు.

ఇప్పటికే జట్టును ఎంపిక చేశారు. వారు బాగా రాణిస్తారని ఆశిద్దాం. కొంత కాలంగా టీమిండియా చాలా అద్భుతంగా ఆడుతోంది. ప్రపంచకప్‌ భారత జట్టు కూర్పు చాలా బాగుంది. భారత జట్టు గెలిస్తే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలుస్తాం. ఈ ప్రపంచకప్‌లో పరుగుల వరద పారే అవకాశం ఉంది. టీమిండియా కూడా పరుగుల వరద పారిస్తుంది. ప్రపంచకప్‌ జరిగే ఇంగ్లండ్‌లో పాత పరిస్థితులు ఇప్పుడు లేవు. వన్డేలకు అక్కడి వాతావరణం సానుకూలంగా ఉంది. అత్యధిక పరుగులు సాధించే అవకాశాలు ఉన్నాయి, అని ద్రవిడ్‌ అభిప్రాయపడ్డారు.

Related posts