telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రీడలు తెలంగాణ వార్తలు వార్తలు

పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో కుబా క్రిస్టిన్ పై విజయం సాధించింది పివి సింధు

పారిస్ ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. బ్యాడ్మింటన్  లో  భారత్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు.

తెలుగుతేజం బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు సైతం గ్రూప్ ఎంలో వరుసగా రెండో లీగ్ మ్యాచ్లో విజయం సాధించింది.

దీంతో సింధు ప్రీక్వార్టర్స్‌ కు చేరుకుంది. గత టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన సింధు. ఈసారి బంగారు పతకంపై గురిపెట్టింది.
మాల్దీవులపై మొదటి లీగ్ మ్యాచ్లో సునాయసంగా గెలిచిన సింధు.

తన రెండో మ్యాచ్లోనూ ఎస్తోనియాకు చెందిన కుబా క్రిస్టిన్‌ పై ఈజీగా విజయం సాధించింది. గేమ్‌లో సింధు అద్భుత స్మాష్‌లకు క్రిస్టిన్‌ వద్ద సమాధానం లేదు.

కీలకమైన నాకౌట్ రౌండ్‌లలోకి అడుగుపెట్టిన పివి సింధుకు చాలా సానుకూల సంకేతం. 21-5, 21-10 తేడాతో వరుస రెండు సెట్లను పీవీ సింధు గెలుచుకుంది.

Related posts