ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్ట్ లు పెట్టిన వ్యక్తిని విజయనగరం జిల్లా పార్వతీపురం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్వతీపురం ఏఎస్పీ సుమిత్ గరుడ మాట్లాడుతూ నిందితుడు వెంకటేశ్వర్లు నెల్లూరు జిల్లా వాసిగా కావలి పోలీసులు గుర్తించారని ఏ రాజకీయపార్టీతోనూ అతనికి సంబంధం లేదని తమ విచారణలో తేలినట్టు చెప్పారు.
నిందితుడు బెంగళూరులో ఉన్నట్టు గుర్తించి ఓ బృందాన్ని అక్కడికి పంపి అతన్ని అరెస్టు చేసినట్టు వివరించారు. కాగా, గత ఏడాది జూన్ లో ‘ఫేస్ బుక్’ వేదికగా పుష్పశ్రీవాణిపై అసభ్యకర పోస్ట్ లు చేశాడు. ఈ విషయమై విజయనగరం పోలీసులకు ఆమె గత అక్టోబరులో ఫిర్యాదు చేశారు.

