అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను ప్రధాని మోదీ సోమవారం వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు.
వందల కోట్ల రూపాయిలతో ప్రారంభించిన ఈ టెర్మినల్ ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకొంది.హైదరాబాద్ మహానగర పరిధిలోని చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
సోమవారం ఉదయం 10.30 గంటలకు ఈ రైల్వే టర్మినల్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తోపాటు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు హాజరయ్యారు.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు హైదరాబాద్ మహ నగరంలోని జీవించేందుకు తరలి వస్తున్నారు.
అలాంటి వేళ సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఆయా రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు రైల్వే శాఖ నడం బిగించింది.
ఈ నేపథ్యంలో నగర శివారులోని చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి పరచాలని నిర్ణయించింది. అందులోభాగంగా చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి పరిచింది.
ఈ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి పరచడం ద్వారా నగరంలోని ఇతర రైల్వే స్టేషన్ల పై ఒత్తిడి తగ్గుతోందని అధికారులు భావిస్తున్నారు. అందుకోసం వందలాది కోట్లతో ఈ రైల్వే టర్మినల్‌ను రైల్వే శాఖ అభివృద్ధి పరిచింది.
అంతర్జాతీయ విమానాశ్రయ తరహాలో చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను అభివృద్ధి చేశారు. ఈ స్టేషన్ నుంచి 24 రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.
ఇక ఈ టెర్మినల్ గూడ్స్ రైళ్లకు సైతం మరో రకంగా ఉపయోగపడనుంది. అంటే.. హైదరాబాద్ పారిశ్రామిక అవసరాలకు తగినట్లుగా గూడ్స్ రైళ్లు ఇక్కడి నుంచి నడవనున్నాయి. రూ. 428 కోట్లతో చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి పరిచారు.
ఈ స్టేషన్ చాలా పెద్దగా ఉండటమే కాకుండా.. వాహనాల పార్కింగ్ సౌకర్యం కూడా పెద్దగా ఉంది. ఐదు లిఫ్టులతోపాటు, ఐదు ఎస్కలేటర్లను సైతం ప్లాట్‌ఫామ్స్‌లో ఏర్పాటు చేశారు.
అలాగే పార్సిల్ బుకింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించారు. 25 జతల రైళ్లను హ్యాండిల్ చేసేలా ఈ స్టేషన్లో ట్రాకులు ఏర్పాటు చేశారు. అందుకోసం 10 కొత్త ట్రాకులను నిర్మించారు.
ఈ స్టేషన్లో మొత్తం 19 ట్రాక్స్ ఉన్నాయి. దీంతో ఈ టెర్మినల్ చాలా పెద్దగా ఉంటుంది. మరోవైపు ఈ స్టేషన్లో మొత్తం మూడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు ఉన్నాయి.
గతంలో ఒకటి ఉండగా.. నూతనంగా రెండు టర్మినల్స్‌ను నిర్మించారు. దేశంలో మారుతోన్న పరిస్థితులను అనుగుణంగా.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోని.. ఈ టెర్మినల్‌ను రైల్వే శాఖ రూపొందించింది.


తెలంగాణాలో రాజన్న రాజ్యం తీసుకొస్తా : షర్మిల