telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

జైపూర్‌ పేలుళ్ల ఘ‌ట‌న‌లో నలుగురికి మ‌ర‌ణ‌శిక్ష

New couples attack SR Nagar

ప‌దేళ్ల క్రితం జైపూర్‌లో జ‌రిగిన పేలుళ్ల ఘ‌ట‌న‌లో సుమారు 80 మంది మ‌ర‌ణించారు, 170 మంది గాయ‌ప‌డ్డారు. 2008లో జరిగిన ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు దోషుల‌కు మ‌ర‌ణ‌శిక్ష విధిస్తూ రాజ‌స్థాన్ కోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొహ్మ‌ద్ సైఫ్‌, స‌ర్వార్ ఆజ్మీ, స‌ల్మాన్‌, సైఫుర్ రెహ్మాన్‌లు నిందితులుగా ఉన్నారు.

ఈ కేసులో షాబాజ్ హుస్సేన్ నిర్దోషిగా బ‌య‌ట‌ప‌డ్డాడు. కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు ప్ర‌స్తుతం తీహార్ జైలులోనే శిక్ష‌ను అనుభ‌విస్తున్నారు. మొహ్మ‌ద్ అతిన్ అనే వ్య‌క్తి జైపూర్‌లో బాంబు పేలుళ్లకు పథకం వేసినట్టు తెలుస్తోంది. అయితే అత‌న్ని బాట్లా హౌజ్ ఎన్‌కౌంట‌ర్‌లో హతమార్చారు.

Related posts