ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ , మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ దంపతుల కుమారుడు లక్ష్మీనారాయణ్ సందీప్-పూజితల వివాహం హైదరాబాద్ లోని ఘనంగా జరిగింది.
ఈ వేడుకకు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఏపీతో పాటు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర సెలబ్రెటీలు పెళ్లి వేడుకలో సందడి చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి దంపతులు పెళ్లికి హాజరయ్యారు.నూతన వధువరులు డాక్టర్ లక్ష్మీనారాయణ్ సందీప్, పూజితను సీఎం జగన్ దంపతులు ఆశీర్వదించారు.
మెగాస్టార్ చిరంజీవి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగబాబుతో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా వివాహానికి హాజరై.. వధూవరులను ఆశీర్వదించారు.
తెలంగాణకు చెందిన రాజకీయ నేతలు కూడా హాజరయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి, ఈటెల రాజేందర్ సహా పలువురు నేతలు వధూవరులను ఆశీర్వదించారు.
ప్రభుత్వం తనను వేధిస్తోందని కోడెల ఆవేదన చెందేవారు: సుజనా చౌదరి