telugu navyamedia
ఆంధ్ర వార్తలు

టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు..

ఏపీలో టీడీపీ, వైసీపీ వర్గాలు పోలిటిక‌ల్ వార్ న‌డుస్తుంది. తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. అయ్యన్నపాత్రుడుపై గుంటూరు జిల్లా నకరికల్లు పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది. కండ్లకుంటలో జరిగిన కోడెల వర్ధంతి సభలో అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై మాజీ సర్పంచ్, వైకాపా నేత కంఠంనేని కోటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆయన ఫిర్యాదుతో అయ్యన్నపాత్రుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి, ఐపీఎస్ అధికారులను కించపరిచేలా అయ్యన్నపాత్రుడు మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. అయ్యన్నపాత్రుడుపై 353, 500, 504 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా..టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు.. గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి పోటీచేసి ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ సోదరుడు ఉమాశంకర్ గణేష్ చేతిలో ఓటమిచెందారు. ఆ ఓటమిని జీర్ణించుకునే లోపే ఆయన తమ్ముడు గట్టి షాక్ ఇచ్చారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి చేశారు. ఇరువురు వేర్వేరు పార్టీల్లో ఉండడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి.

Related posts