telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఆ నాలుగు రాష్ట్రలో కరోనా డ్రై రన్ ప్రారంభం..

corona vacccine covid-19

కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధమవుతోంది కేంద్ర ప్రభుత్వం.. దీని కోసం ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ముందుగా కోవిడ్ వ్యాక్సిన్ ‘డ్రై రన్’ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లోని ఎనిమిది జిల్లాలను ‘డ్రై రన్’ కార్యక్రమం కోసం ఎంపిక చేశారు.. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వ్యాక్సిన్ ఇవ్వటం మినహాయించి.. మిగిలిన అన్ని దశలను పరిశీలించనున్నారు అధికారులు.. ఈ క్రమంలో క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సవాళ్లు, టీకా అనంతరం ఎదురయ్యే పరిణామాలపై ఏ మేరకు అప్రమత్తంగా ఉండగలుగుతున్నాం అనే విషయంపై ఫోకస్ పెట్టనున్నారు. కోల్డ్‌ స్టోరేజ్‌ల నిర్వహణ, రవాణా ఏర్పాట్లు, భౌతిక దూరం పాటించేలా ప్రజలను అదుపుచేసే విధానం అమలును కూడా ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు.. ఇందుకు పంజాబ్‌, అసోం, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల నుంచి రెండు జిల్లాల చొప్పున మొత్తం ఎనిమిది జిల్లాల్లో ఈ నెల 28న ఈ డ్రై రన్ ప్రారంభం కానుంది.. ఇది రెండు రోజుల పాటు అంటే.. 28, 29 తేదీల్లో నిర్వహించనున్నారు.. దీనిలో భాగంగా ఈ నెల 28న కృష్ణా జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ చేపట్టనున్నారు.. దీని కోసం జిల్లా యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు వైద్యారోగ్యశాఖ అధికారులు.. ఐదు పోలింగ్ బూత్‌లను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎంపిక చేసిన పోలింగ్ బూత్‌ల్లో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ చేపట్టనున్నారు. కేంద్రం సూచనలకు లోబడి ఈ డ్రై రన్‌కు ఏర్పాట్లు చేస్తోంది యంత్రాంగం.

Related posts