telugu navyamedia
ఆంధ్ర వార్తలు

తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తాలు..

ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు, ఉత్తర్వులు తెలుగు భాషలోనే జారీ చేసేవిధంగా తగు చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వ కార్యాలయాల్లో 13శాతం మందికి మాత్రమే అర్థమయ్యే ఆంగ్లభాషలో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగుతున్న విషయాన్ని పిటిషన్లో పేర్కొన్నారు.

రాష్ట్ర అధికార భాషా చట్టాన్ని అమలు చేసేవిధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్లను తెలుగులో నిర్వహించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అధికార భాష పర్యవేక్షణ అధికారులను నియమించేలా ఆదేశించాలని పిటిషన్‌ లో కోరారు.

2017లో తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక చట్టానికి అనుగుణంగా.. తెలుగు భాషాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ యువత అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చి కోర్టులో ప్రజావ్యాజ్యం దాఖలు చేశారు.

Related posts