కేంద్రం ఎన్ఈపీ-2020 పేరిట నూతన విద్యావిధానం) తీసుకువచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలోనే సాగాలన్న ప్రధాన సిద్ధాంతంతో ఎన్ఈపీ-2020ని కేంద్రం ప్రతిపాదించింది. ఈ విధానాన్ని స్వాగతిస్తున్నట్టు జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటన చేశారు. పవన్ కల్యాణ్ విద్యావిధానం ఎలా ఉండాలన్న దానిపై ఓ వీడియోలో వివరించారు. దీనిపై తాజాగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ స్పందించారు.
బహుముఖ విద్యావిధానం పట్ల పవన్ కల్యాణ్ వెల్లడించిన అభిప్రాయాలను కేంద్రం నూతన విద్యావిధానం తుది ముసాయిదా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుందని వెల్లడించారు. తాజా విద్యావిధానంలో విద్యార్థులకు విస్తృతస్థాయిలో సబ్జెక్టులు ఎంచుకునే వీలుంటుందని రమేశ్ పోఖ్రియాల్ ట్విట్టర్ లో వివరించారు.

