telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గదర్ అవార్డుల కమిటీ చైర్మన్ గా బి. నర్సింగరావు

గద్దర్ అవార్డుల కోసం ప్రత్యేక కమిటీని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. లోగో, విధి విధానాలు, నియమ నిబంధనలను ఈ కమిటీ రూపొందిస్తారు.

గద్దర్ అవార్డుల కమిటీకి ఛైర్మన్ గా బి.నర్సింగ రావు,నియమితులయ్యారు. వైస్ ఛైర్మన్ గా నిర్మాత దిల్ రాజును నియమించారు.

గద్దర్ అవార్డుల కమిటీ సలహా సభ్యులుగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, కవి అందెశ్రీ, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత అల్లు అరవింద్, గద్దర్ కుమార్తె గుమ్మడి వెన్నెల, రచయిత తనికెళ్ల భరణి, నిర్మాత డి.సురేష్ బాబు, గేయ రచయిత చంద్రబోస్, నట దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్, దర్శకుడు అల్లాణి శ్రీధర్, నిర్మాత సానా యాదిరెడ్డి, దర్శకుడు హరీశ్ శంకర్, దర్శకుడు బలగం వేణును నియమించారు.

Related posts