జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం నిమిత్తం హైదరాబాద్ నుండి మంగళగిరికి ప్రయాణిస్తున్న పవన్ కళ్యాణ్ కాన్వాయి ప్రమాదానికి గురైంది. అభిమానుల భారీ ర్యాలీతో బయల్దేరిన పవన్ కళ్యాణ్ కాన్వాయ్ లో రెండు వాహనాలు డీ కొట్టుకున్నాయి.

ఈ ప్రమాదంలో వాహనం ముందు భాగం నుజ్జు నుజ్జు అయిపోయింది. అయితే ప్రమాదం జరిగిన ఆ వాహనంలోని రెండు ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వటంతో ఎవ్వరికి ప్రమాదం కాలేదని తెలుస్తుంది.

ఈ ఘటన మంగళగిరి డీజీపీ కార్యాలయ సమీపంలోకి ఆయన కాన్వాయ్ రాగానే.. కాన్వాయ్‌లోని రెండు కార్లు ఢీకొన్నాయి. ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం జరిగిన కారులో పవన్ కళ్యాణ్ లేడని తెలుస్తుంది.

కాగా.. వైసీపీ నేతల మూకుమ్మడి దాడి జరుగుతుండగా.. పవన్ ఏపీలో కృష్ణా, గుంటూరు జిల్లాల పర్యటనకు పూనుకోవడం ఉత్కంఠ నెలకొంది.


చంద్రబాబుపై కోపంతో జగన్ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తారో: సోమిరెడ్డి