నందమూరి బాలకృష్ణకు తాజాగా అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్లో ఆయన పేరు నమోదైంది.
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నటుడిగా నిలిచారు బాలయ్య.
సినీ ఇండస్ట్రీలో నటుడిగా 50 వసంతాలు పూర్తి చేసుకున్నారాయన. సినిమా ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలను గుర్తించి ఆయనకు ఈ పురస్కారాన్ని అందించనున్నారు. ఈ నెల 30న బాలయ్యను ఈ పురస్కారంతో సత్కరించనున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ద్వరా బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన సినిమాకు చేసిన సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా ఆయన తన పోస్టులో బాలనటుడిగా తెలుగు చలన చిత్ర రంగంలోకి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా అడుగుపెట్టి జానపదాలు, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ,
నట జీవితంలో 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్న తరుణంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ( లండన్) లో చోటు సాధించిన ప్రముఖ నటులు, హిందూపురం MLA, పద్మ భూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.
ఆయన మరిన్ని సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ, ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు.

