పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మలయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్ గా రూపొందుతోంది. ఇందులో పవన్ సరసన నిత్యమీనన్ నటిస్తోంది.అలాగే రానా సరసన ఐశ్యర్యా రాజేష్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి.

తాజాగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘భీమ్లా నాయక్’ సినిమాలోని ‘లా లా భీమ్లా.. ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో నాగరాజు గారు హార్టీ కంగ్రాచ్చులేషన్స్ అండి.. మీకు దీపావళి పండుగ ముందే వచ్చేసిందండి హ్యాపీ దీపావళి అంటూ పవన్ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 నుంచి థియేటర్లలో విడుదల కానుంది.


ఆ బాలీవుడ్ సినిమా చేసినందుకు బాధ పడడం లేదు : పూజాహెగ్డే