పిఠాపురం అభివృద్ధికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
పిఠాపురం డెవలెప్మెంట్ పై అమరావతిలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన శాంతిభద్రతలు, వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తీసుకుంటున్న చర్యలతోపాటు పలు అంశాలపై చర్చించారు.
ఇకపై ప్రతివారం నియోజకవర్గ అభివృద్ధి పై రివ్యూ చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.
శాంతిభద్రతల అంశంపైనా ప్రత్యేకంగా ఆరా తీసిన పవన్ పిఠాపురం పోలీసుల వ్యవహారాలపై పత్రికల్లో వచ్చిన కథనాలను ప్రస్తావించారు.
పిఠాపురానికి సంబంధించి తన దృష్టికి వచ్చిన కొన్ని అంశాలను ఆయన పేషీ అధికారులకు వివరించి వాటిని వెంటనే జిల్లా పోలీసు యంత్రాంగానికి తెలియచేయాలని సూచించారు.
పిఠాపురం సెగ్మెంట్లోని నాలుగు పోలీస్ స్టేషన్లలోని పరిస్థితులపై ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకోవాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
పిఠాపురం నియోజకవర్గ పోలీసుల తీరుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతికి పాల్పడుతున్న పోలీసు అధికారుల కారణంగా హోంశాఖ చులకన అవుతోందన్నారు.
ప్రజలను ఇబ్బందిపెట్టే నేరస్తులనే కాదు ఆ నేరస్తులకు అండగా నిలుస్తున్న నాయకులు, పోలీసులను కూడా ఉపేక్షించేదిలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
పిఠాపురం అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
కులాల మధ్య చిచ్చు పెట్టి పైశాచిక ఆనందం: సుజనా చౌదరి ఫైర్