ఇకపై ఆధార్ ఆధార్ వివరాలను ఆన్ లైన్ లో ఎంటర్ చేస్తే వెంటనే పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య)ను జారీ చేస్తారు. సాధారణ పాన్ కార్డు ఆపై ఇంటికి వచ్చేస్తుంది. ఇక ఆధార్ కార్డు ఉన్నవాళ్లు, పాన్ కార్డు పొందాలంటే తొలుత ఇన్ కమ్ టాక్స్ ఈ ఫైలింగ్ పోర్టల్ కు వెళ్లి, ‘ఇన్ స్టంట్ పాన్ థ్రూ ఆధార్’ లింక్ పై క్లిక్ చేసి, ఆపై ‘గెట్ న్యూ పాన్’ ఆప్షన్ ఎంచుకోవాలి.
కొత్త పాన్ సంఖ్య కోసం మీ ఆధార్ సంఖ్యను అడుగుతుంది. అక్కడ ఇచ్చిన బాక్స్ లో ఆధార్ ను ఎంటర్ చేస్తే, మీ ఆధార్ కు అనుసంధానితమైన ఫోన్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయగానే, ఇతర ఆధార్ లోని వివరాలను అడుగుతుంది. మీ ఈ మెయిల్ ను, ఇతర వివరాలను ఎంటర్ చేయగానే, యూఐడీఏఐ డేటాలో సరిచూసుకునే ఐటీ వెబ్ సైట్, వెంటనే పాన్ నంబర్ ను కేటాయిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ కేవలం పది నిమిషాల్లో పూర్తవుతుంది. ఆపై మీ పాన్ కార్డును పీడీఎఫ్ ఫార్మాట్ లో డౌన్ లోడ్ చేసుకుని ప్రింటవుట్ తీసుకోవచ్చు.
ఉన్న ఒక్క జనసేన ఎమ్మెల్యేనూ లాక్కునేందుకు కుట్ర: పవన్