telugu navyamedia
రాశి ఫలాలు

అక్టోబర్ 22, శుక్రవారం రాశిఫలాలు..

మేష రాశి
అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి.పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రయాణాలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగరంగాల్లో బదిలీ అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణప్రయత్నాలు చేస్తారు. కావాల్సినవారి కోసం ఎదురు చూస్తారు.కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం ల‌భిస్తుంది.

వృష‌భ రాశి..
రాజకీయ నాయకులు సభలు, సన్మానాల్లో పాల్గొంటారు. స్త్రీలు పిల్లల పట్ల శ్రద్ధ తీసుకుంటారు. అనారోగ్య బాధలు కలుగుతాయి. భయందోలనకు గురవుతారు. వ్యాపార రంగంలోని వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.శుభకార్యాలకు హాజరవుతారు. ఆలయాలు సందర్శిస్తారు.

మిధున రాశి
మీ బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధన సహాయాన్ని అర్థిస్తారు. మీ కుటుంబీకుల గురించి గొప్ప గొప్ప పథకాలు వేస్తారు. ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. వృధా ప్రయాణాలు చేసే అవకశం ఉంది. సన్నిహితులతో విరోధం ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి.

కర్కాటక రాశి
వాతావరణంలోని మార్పులు ఎంతో ఆందోళన కలిగిస్తాయి..బంధు, మిత్రులతో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. శారీరక శ్రమ, మానసిక ఆందోళన కలుగే అవకాశం ఉంది. చిన్న చిన్న పనులకు కూడా ఎక్కువగా శ్రమపడాల్సి ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు వింటారు.

సింహ రాశి
నూతన గృహనిర్మాణ పనులను చేపట్టే అవకాశం ఉంది.మిత్రులతో వివాదాలు.. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం.గతంలో చేసిన అప్పులు తీరుస్తారు. రుణబాధలు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు తీరి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన..అనుకోని ప్రయాణాలు చేస్తారు.

కన్య రాశి
పనులు ముందుకు సాగవు. ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. కీళ్లనొప్పులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మానసిక ఆందోళన కలుగుతుంది. ప్రయాణం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

తులా రాశి
ఆర్థిక వ్యవహారాల్లో ఆచి, తూచి వ్యవహరిస్తారు. రవాణా రంగంలో వారికి సంతృప్తి కానరాగలదు. కళాకారులకు, మీడియా రంగాలవారికి మేలు కలుగుతుంది. కుటుంబంలో సంతోషం కలుగుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొత్త వస్తు, నగలను కొనుగోలు చేస్తారు. సమాజంలో మంచి పేరు, ప్రతిష్ఠలు సంపాదించుకుంటారు.దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు.

వృశ్చిక రాశి
ఇసుక, క్వారీ, బిల్డింగ్ కాంట్రాక్టర్లకు అభ్యంతరాలు ఎదుర్కోవలసి వస్తుంది. అధిక ప్రయాణాలు చేసేయాల్సి ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ఖర్చులు చేస్తారు. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి.సంఘంలో విశేష గౌరవం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత ఉంటుంది.

ధనుస్సు రాశి
ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవర్శనం చేసుకుంటారు. అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. చిరకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి.

మకర రాశి
కుటుంబసభ్యులతో వివాదాలు ఏర్ప‌డ‌తాయి.. ధనవ్యయం. బంధు, శుభవార్త వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. కొత్త వస్తు, నగలను కొనుగోలు చేస్తారు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకు కలిగిస్తుంది.

కుంభ రాశి
ఆస్తి వివాదాల పరిష్కారం అవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆరోగ్యం విషయం ఇబ్బందులను ఎదుర్కొంటారు. భయాందోళనలకు గురవుతారు. కొత్త్తపనులను ఆలస్యంగా చేపడతారు. మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంది.ఉద్యోగస్తులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది.

మీన రాశి
మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. ఆర్ధికంగా మంచి ఫలితాలను పొందుతారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. అన్నదమ్ములతో కలహాలు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. నూతన వ్యక్తులతో పరిచయాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

Related posts