telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కుముద్ బెన్ జోషీ అంటే ఎన్ .టి .ఆర్ మండిపడేవాడా ?

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా పనిచేసిన కుముద్ బెన్ జోషీ ఈనెల 14న గుజరాత్ లోని చంగా ధనోరి గ్రామంలో తన 88 వ ఏట చనిపోయారు . కుముద్ బెన్ జోషీ ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా 26 నవంబర్ 1985లో నియమితులై 7 ఫిబ్రవరి 1990 వరకు పనిచేశారు.

అప్పుడు ఎన్ ,టి రామారావు గారు ముఖ్యమంత్రిగా వున్నారు .దేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ వున్నారు . కుముద్ బెన్ 1973 నుంచి 1976, 1976 నుంచి 1982, 1982 నుంచి 1985 వరకు మూడు పర్యాయాలు రాజ్యసభ సభ్యురాలుగా వున్నారు.

1980 నుంచి 82 మధ్యలో కేంద్ర సమాచార శాఖ డిప్యూటీ మంత్రిగా , 1982 నుంచి 1984 మధ్యలో ఆరోగ్య కుటుంబ శాఖ డిప్యూటీ మంత్రిగా పనిచేశారు . కుముద్ బెన్ జోషి గవర్నర్ గా వున్నప్పుడు రాజ్ భవన్ రాజకీయాలకు కేంద్రంగా ఉండేది . రాష్ట్ర మంత్రులు , ముఖ్యమంత్రి కూడా ఆమె వ్యవహార శైలిపై మండిపడుతూ ఉండేవారు . ఆమె ఒక గవర్నర్ గా కాక రాజకీయ నాయకురాలిగా చాలా చురుకుగా ఉండేవారు.

Kumudben Joshi - Wikipedia

నిత్యం రాజ్ భవన్ లో కాంగ్రెస్ నాయకులు మకాం వేసేవారు . కుముద్ బెన్ తనదైన పద్దతిలో పనిచేసేది . తెలుగు దేశం పార్టీ నాయకుల విమర్శలను అసలు పట్టించుకునేది కాదు . రిపబ్లిక్ డే సందర్భంగా ఆమె ” కేంద్ర ప్రభుత్వ సహాయ , సహకారాలు లేకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించలేదు ” అన్న మాటలకు ముఖ్యమంత్రి ఎన్ .టి . రామారావు మండిపడ్డాడు . ఆమెపై అప్పటి రాష్ట్రపతి ఆర్ . వెంకట్రామన్ కు ఫిర్యాదు చేశారు .

ఎప్పుడూ నగరంలోననో , జిల్లాల్లోనో కాంగ్రెస్ నాయకులతో పాటు పర్యటిస్తూ ఉండేది . నగరంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ , సినిమా ప్రారంభోత్సవాల్లోనూ పాల్గొనేది . అప్పట్లో నిర్మాత దర్శకుడు కె .బి .తిలక్ అంటే కుముడు బెన్ బాగా అభిమానించేది . ఆయన కూడా ఎక్కువ సమయం రాజ్ భవన్ లోనే ఉండేవాడు . సినిమా కార్యక్రమాలకు తిలక్ ఆహ్వానిస్తూ ఉండువాడు. తిలక్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉండేవాడు .

అప్పట్లో హీరో కృష్ణ కు ఎన్ .టి. రామారావు కు పడేది కాదు .రాజీవ్ గాంధీ స్పూర్తితో కాంగ్రెస్ పార్టీలో చేరి పార్లమెంట్ కు ఎన్నికయ్యారు . తిలక్ అటు రాజ్ భవన్ లేదా పద్మాలయ స్టూడియోస్ లో ఉండేవారు . కృష్ణ , తిలక్ ఇద్దరు ముఖ్యమంత్రి రామారావు కు వ్యతిరేకంగా మాట్లాడేవారు , సినిమాలు తీసేవారు కాబట్టి కుముద్ బెన్ వీరితో సన్నిహితంగా ఉండేవారు . కాంగ్రెస్ అజెండా ను అమలుపరుస్తూ ఉండేవారు . .

ఆమె స్వతంత్ర వ్యవహార శైలి తెలుగు దేశం నేతలకు మింగుడు పడక పోయినా , కాంగ్రెస్ నేతలు మాత్రం రాజభవన్ సాక్షిగా నడిచే రాజకీయంలో భాగస్వాములుగా ఉండేవారు . 1990లో గవర్నర్ గా పదవీ కాలం పూర్తి అయినా తరువాత ఆమె తన స్వరాష్ట్రం గుజరాత్ వెళ్ళిపోయింది . తన స్వగ్రామం చంగా ధనోరి లో మృతి చెందారు .

-భగీరథ

Related posts