హైదరాబాద్ గాంధీభవన్లో ఎన్ ఎస్ యూ ఐ నేతలు శిక్ష బచావో – దేశ్ బచావో అనే పోస్టర్ ని ఆవిష్కరించారు. ఎన్ ఎస్ యూ ఐ జాతీయ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర కమిటీ ఈ పోస్టర్ ని ఆవిష్కరించింది.
పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని, టీఆర్ ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన కేజీ టు పీజీ ఉచిత విద్యను వెంటనే అమలు చేయాలని, విద్య ప్రయివేటీకరణ ఆపి, ప్రభుత్వమే అన్ని కాలేజీలను ప్రభుత్వమే నడిపించాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలనే పలు డిమాండ్లతో వున్న పోస్టర్ ఆవిష్కరించారు ఎన్ ఎస్ యూ ఐ నేతలు.


కాంగ్రెస్కు ఓటేస్తే టీఆర్ఎస్కు వెళ్లే పరిస్థితులు: కిషన్ రెడ్డి