ఖమ్మం..రైతుల్లారా పోరాటానికి సిద్ధం కండి, కేంద్రం మెడలు వంచి వడ్లను కొనిపిద్దాం అంటూ తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ రైతులకు పిలుపునిచ్చారు. 12న జరిగే రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు రైతులు ఆశేషంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయనన్నారు.
ఖమ్మం నియోజకవర్గ టీఆర్ ఎస్ పార్టీ ముఖ్యనేతలు, కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఆహార భద్రత చట్టం ప్రకారం రైతులు పండించిన వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలని, కానీ, అందుకు విరుద్ధంగా మోదీ ప్రభుత్వం వడ్లను కొనమని చెబుతూ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా నిలిచిందని ఆయన చెప్పుకొచ్చారు.
14ఏళ్ల సుధీర్ఘ పోరాటంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఆగం కాకుండా, సీఎం కేసీఆర్ ఎంతో ఇష్టంగా బంగారు తెలంగాణ వైపు వడివడిగా అడుగులు వేస్తుంటే, కేంద్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని ఆయన మండిపడ్డారు.
చర్చలు జరపాలని కోర్టు చెబుతుంటే..కేసీఆర్ షరతులు పెడుతున్నారు: వీహెచ్