telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదు: విజయసాయి రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. చంద్రబాబుతో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని ఆయన పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్ తనకు 20 ఏళ్లుగా మిత్రుడని, ఆయన్ను తాను ఎప్పుడూ విమర్శించలేదని, భవిష్యత్తులో కూడా విమర్శించబోనని ఆయన అన్నారు.

ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. శ్రీకాకుళంలో ఆదివారం రెడ్డి సంక్షేమ సంఘం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని, అయితే ప్రస్తుతానికి మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని స్పష్టం చేశారు.

జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఓ కోటరీ చేరి, ఆయన్ను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు.నిబద్ధత లేని వ్యక్తుల మాటలను జగన్ నమ్మవద్దని సూచించారు.

వారి వల్లే తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు.

అయితే, కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన గానీ, వేరే పార్టీలో చేరే ఉద్దేశం గానీ తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో తనపై అనేక ఒత్తిళ్లు వచ్చినా దేనికీ లొంగలేదని అన్నారు.

Related posts