మహేష్ బాబు, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా రూపొందుతోంది. ఓ మామూలు మనిషి .. ‘మహర్షి’ ఎలా అయ్యాడనే కథాంశంతో ఈ సినిమా నిర్మితమవుతోంది. మహేశ్ బాబుకి ఇది 25వ సినిమా కావడంతో, ఆయన అభిమానులంతా ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. డిఫరెంట్ లుక్ తో మహేశ్ బాబు నుంచి వచ్చిన ఫస్టులుక్ ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచుతోంది. ఈ సినిమాలో యాక్షన్ తోపాటు ఎమోషన్ పాళ్లు కూడా ఎక్కువగానే ఉంటాయనేది ఫిల్మ్ నగర్లో వినిపిస్తోన్న టాక్.
తాజాగా హైదరాబాద్ – శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో జరగనున్న ఈ సినిమా షూటింగుకు అవాంతరం ఎదురైంది. నిన్న ఉదయం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో షూటింగ్ చేసుకోవడానికి “మహర్షి” టీమ్ అధికారుల నుంచి ముందుగానే అనుమతులు తీసుకుంది. అయితే కొన్ని భద్రతా కారణాల రీత్యా అధికారులు తాము ఇచ్చిన అనుమతులను రద్దు చేశారు. చిత్రబృందం అధికారులతో సంప్రదింపులు జరపడానికి ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో 5 గంటలపాటు తన క్యారవాన్ లో నిరీక్షించిన మహేశ్ బాబు, ఓపిక నశించడంతో మహేష్ బాబు అసహనంగా తిరిగి వెళ్లిపోయారని తెలుస్తోంది.


పవన్ కు కుదరలేదు కానీ… చిరంజీవి మాత్రం నా మీద పగ తీర్చుకుంటున్నాడు… : శ్రీరెడ్డి కామెంట్స్