ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కొత్త ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌ను నియమించింది. ఆస్ట్రేలియా దేశవాళీ మాజీ ఆటగాడు రాబ్ క్యాసెల్‌ను ఇందుకు ఎంపిక చేసింది. దక్షిణ ఆస్ట్రేలియా, ఐర్లాండ్ పురుషుల క్రికెట్ జట్టులో చక్కని పేసర్లను రూపొందించారు. కేన్ రిచర్డ్‌సన్, జో మెన్నీ, టిమ్ ముర్తాగ్, బాయ్‌డ్ రాన్‌కిన్ వంటి బౌలర్లను తయారుచేసింది ఆయనే కావడం గమనార్హం. క్యాసెల్ 2002లో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుకు ప్రతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచుల ఆడే అవకాశం మాత్రం అతడికి రాలేదు. మొదట ఆసీస్‌లో దేశవాళీ జట్లకు కోచింగ్ అందించిన ఆయన ఆ తర్వాత ఐర్లాండ్‌కు మారారు. ‘కొత్త ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా రాబ్ క్యాసెల్ రావడం సంతోషం. విక్టోరియాకు ఆడే రోజుల్నుంచి అతడితో నాకు సత్సంబంధాలు ఉండేవి. ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఆయనెంతో కష్టపడ్డారు.
అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ఎందరో పేసర్లకు సాయం అందించారు. వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వినూత్నం వారికి శిక్షణ ఇచ్చేవారు. రాయల్స్‌కు ఆయన అనుభవం ఉపయోగపడుతుంది’ అని రాజస్థాన్ ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ అన్నాడు. మంచి సామర్థ్యం ఉన్న భారత్, విదేశీ ఆటగాళ్లతో రాయల్స్ చక్కని ఫాస్ట్ బౌలింగ్ విభాగం ఉంది. కొన్నాళ్లుగా ఆ జట్టును అనుసరిస్తున్నాను. అద్భుతంగా పోటీపడే పేసర్లు ఆ జట్టుకు ఉన్నారు. నా ఆలోచనలు, సలహాలతో వారి సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు కృషిచేస్తా అని క్యాసెల్ తెలిపాడు. రాయల్స్‌కు గతేడాది స్టెఫాన్ జోన్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. అతనిప్పుడు అభివృద్ధి కోచ్‌గా పనిచేయనున్నాడు.

