telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నితిన్ సినిమాలో ఆ బోల్డ్ పాత్ర కోసం నయన్ ?

Nayan

ఆయుష్మాన్ ఖురానా హీరోగా రాధికా ఆప్టే, టబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన అంధాదున్ మూవీ మంచి విజయం సాధించింది. ఆ మూవీలో నటనకు గాను హీరో ఆయుష్మాన్ ఖురానా జాతీయ ఉత్తమనటుడు అవార్డు గెలుచుకున్నాడు. ఈ హిందీ చిత్రాన్ని తెలుగులో హీరో నితిన్ రీమేక్ చేయనున్నాడు. దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ మూవీ రీమేక్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఈ మూవీలో బోల్డ్ నెస్ తో కూడిన నెగెటివ్ రోల్ ఒకటి ఉంది. హిందీలో ఆ పాత్రను హీరోయిన్ టబు చేశారు. ఇక తెలుగులో ఈ పాత్ర ఎవరితో చేయించాలి అనే విషయంలో అనేక పేర్లు తెరపైకి వచ్చాయి. రమ్య కృష్ణ, అనసూయ అంటూ అనేక పేర్లు వినిపించాయి. కాగా ఈ పాత్ర కోసం స్టార్ హీరోయిన్ నయనతారను తీసుకోవాలనే ప్రయత్నాలలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి నయన్ ఈ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి.

Related posts