telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనుల పరిశీలించిన మంత్రి నారాయణ

నేలపాడులోని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల క్వార్టర్ల ను, గ్రూప్-డి అధికారుల నివాసాలు, హ్యాపీనెస్ట్ టవర్ల పనులను పరిశీలించిన మంత్రి నారాయణ.

ప్రభుత్వ భవనాల నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేలా కాంట్రాక్ట్ సంస్థలకు దిశానిర్దేశం చేసారు.

క్వార్టర్లు, బంగళాల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మంత్రి.

నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా నిర్మాణ సంస్థలకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీచేశారు.

అధికారుల నివాస సముదాయాలు మార్చిలోగా పూర్తవుతాయి.

ఉద్యోగులకు ఆస్పత్రుల కోసం విట్, ఎస్ఆర్ఎంతో సంప్రదింపులు జరిపాం.

4 వేల మంది ఉద్యోగుల కోసం 100 పడకల ఆస్పత్రి, పాఠశాలలకు అంగీకరించాయి అని తెలిపారు.

రాజధాని పనులు జరగట్లేదని వైసీపీ చేసే దుష్ప్రచారాలు నమ్మొద్దు అన్నారు .

సింగపూర్ ప్రభుత్వంతో మైత్రి పునరుద్ధరణకే సీఎం నేతృత్వంలో పర్యటన అని మంత్రి నారాయణ అన్నారు.

Related posts