విశాఖ టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి ప్రహరీని జీవీఎంసీ అధికారులు జేసీబీలతో కూల్చివేశారు. దీంతో ఆయన ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సీతమ్మధారలోని ఆయన ఇంటి ప్రహరీని ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే అధికారులు కూలిచివేశారని ఆయన ఆరోపించారు.
ఈ ఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. రోజు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎండగడుతున్నారన్న కోపంతోనే నోటీసు కూడా ఇవ్వకుండా సబ్బంహరి ఇంటిని కూల్చే కుట్ర చేశారని ఆయన మండిపడ్డారు.
ఉన్నత విలువలతో రాజకీయాల్లో సబ్బంహరి కొనసాగుతున్నారని, ఆయనపై కక్షసాధింపు చర్యలు జగన్ను మరింత దిగజార్చాయని ఆయన చెప్పుకొచ్చారు. ప్రశ్నిస్తే చంపేస్తామంటున్నారని, విమర్శిస్తే భవనాలు కూల్చేస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. జగన్ తనలో ఉన్న సైకో మనస్తత్వాన్ని ప్రజలకు పరిచయం చేస్తున్నారని ఆయన అన్నారు.


చంద్రబాబు నివాసం చుట్టూ మంత్రుల చక్కర్లు: అచ్చెన్నాయుడు